
3250 రేజీల రేషన్ బియ్యం పట్టివేత
సాలూరు: పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టణ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ మేరకు సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పెదబజార్‌లో గల బుద్దెపు సురేష్ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 75 బియ్యం బస్తాల్లో సుమారు 3,250 కేజీల రేషన్ బియ్యం పట్టుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి తక్కువ ధరకు ఈ బియ్యం కొని, బయట ఎక్కువ ధరకు అమ్ముతానని నిందితుడు తెలిపినట్లు సీఐ పేర్కొన్నారు. పట్టుకున్న బియ్యాన్ని పట్టణ సివిల్‌సప్లయిస్ అధికారులకు తదుపరిచర్యల నిమిత్తం అప్పగించామని తెలిపారు.