
హోంగార్డు కుటుంబానికి పోలీస్ శాఖ ‘చేయూత’
విజయనగరం క్రైమ్: పోలీసు శాఖలో హెూంగార్డుగా విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో పని చేసి, ఇటీవల కార్డియాక్ సమస్యతో మరణించిన శ్రీనివాస్ కుటుంబానికి చేయూత’ పేరుతో రూ.3,23,050 చెక్కును ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం మృతుడి కుటుంబసభ్యులకు అందజేశారు. హోంగార్డు సిబ్బంది మొత్తం పోగుచేసిన ఒకరోజు డ్యూటీ అలవెన్స్ చెక్కును ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాఖలో పని చేస్తూ ఉద్యోగ విరమణ చేసినా లేదా ప్రమాదవశాత్తు కానీ ఆకస్మికంగా, అనారోగ్యంతో మరణించిన హెూంగార్డు కుటుంబాలు ఇంటి యజమానిని కోల్పోయి, ఆర్థికంగా చితికిపోయిన నష్టాల్లో కూరుకుపోయిన కుటుంబాన్ని ఆదుకునేందుకు హెూంగార్డ్స్ అందరూ స్వచ్ఛందంగా ఒక్క రోజు డ్యూటీ అలవెన్స్ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందజేయడం అభినందనీయమని ఎస్పీ ప్రశంసించారు. హోం గార్డు మరణానంతరం ఆయన కుమారుడిని హెూంగార్డుగా నియమించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, హెూంగార్డ్స్’ ఇన్చార్జ్ ఆర్.రమేష్ కుమార్, డీపీఓ సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీస్‌కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.