
ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
వంగర: మండల పరిధి మగ్గూరు–మడ్డువలస రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. మంగళవారం కొప్పర నుంచి రాజాం మీదుగా పాలకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మగ్గూరు దాటిన తరువాత వెనుక టైరు పంక్చర్ అయి పేలిపోయింది. వెనుక భాగంలో ఉన్న రెండు టైర్లలో ఒక టైరు రోడ్డు వెలుపలికి రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఏ ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సులో ఆ సమయంలో సుమారు 50 మంది వరకు ప్రయాణికులున్నారు.