
కొట్టిశలో ఎకై ్సజ్ శాఖ దాడులు
వంగర: మండల పరిధి కొట్టిశ గ్రామంలో ఎకై ్సజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. రాజాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ సీఐ ఆర్.జైభీమ్ ఆధ్వర్యంలో మంగళవారం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యాపారులపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అమరాన వెంకటరావు, కల్లూరి గవరయ్య, నూరి పోలిరాజుల నుంచి 29 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
సబ్ జైల్ ఆకస్మిక తనిఖీ
విజయనగరం లీగల్: విజయనగరం సబ్ జైల్‌ను జిల్లా న్యాయసేవాధికార సంస్ధ అధికారి ఎ.కృష్ణప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయవిజ్ఞాన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల తోటి ఖైదీలు గానీ, సిబ్బంది గానీ ఎటువంటి వివక్ష చూపించ రాదన్నారు. జైలు క్లినిక్‌లను సందర్శించే న్యాయవాదులు, పారాలీగల్ వలంటీర్లు నిర్వహిస్తున్న విధుల పట్ల ఆరా తీశారు. జైల్లో ఉన్న ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆకస్మిక తనిఖీలో సబ్ జైల్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఏ ఇన్‌చార్జ్ పీడీగా సావిత్రి
విజయనగరం టౌన్: డీఆర్‌డీఏ, వెలుగు ఇన్‌చార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కె.సావిత్రి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ ఇక్కడ పీడీగా పనిచేసిన కల్యాణ్ చక్రవర్తి సెర్ప్ డైరెక్టర్‌గా బదిలీ అవడంతో, ఏపీడీ సావిత్రికి పీడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం ఆమె బాధ్యతలు చేపట్టారు. ప్రతి ఒక్కరూ తమ సంపూర్ణ సహకారం అందించాలని ఈ సందర్భంగా అధికారులను, సిబ్బందిని కోరారు. సమష్టిగా పనిచేసి పథకాలను, ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.
కశ్మీరీ పండిట్ గలాటా..!
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కశ్మీరీ పండిట్ మరోసారి స్థానికులను భయాందోళనకు గురిచేశాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని పద్మావతి నగర్‌లో ఉంటున్న కశ్మీరీ పండిట్ తన ఇంటి సమీపంలో అక్రమంగా గోవులను పెంచడం వాటి సంరక్షణపై నిర్లక్ష్యం వహించడాన్ని స్థానికులు, చుట్టు పక్కల వారు ప్రశ్నించిన పాపానికి వారిపైనే తిరిగి దాడులకు దిగాడు. దీంతో వారిలో కొందరు డయల్ 100కు కాల్ చేయగా మరి కొందరు నేరుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మౌఖికంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హుటాహుటిన రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఈ తరహాలోనే పశువులను అన్యాయంగా తన జాగాలోనే బంధించి చిత్ర వధ చేశాడని స్థానికులు సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆ కశ్మీరీ పండిట్ నేరుగా సీఐతో కూడా గలాటాకు దిగడంతో కేసు నమోదుకు సిద్ధపడ్డారు. ఈ విషయంపై సీఐ శ్రీనివాస్‌ను వివరణ కోరాగా సదరు కశ్మీర్ పండిట్ పిచ్చోడిగా కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు.
చెక్‌బౌన్స్ కేసులో
దంపతులకు జైలుశిక్ష
గజపతినగరం రూరల్: సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించక పోవడంతో చెక్ బౌన్స్ కేసులో దంపతులకు జైలుశిక్ష విధించినట్లు గజపతినగరం జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎ.విజయ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పురిటిపెంట గ్రామానికి చెందిన గణరాజు అప్పలనరసింహరాజు, జ్యోతి దంపతుల దగ్గర లవుడు అప్పలనాయుడు, లక్ష్మి దంపతులు అవసరం నిమిత్తం కొంత నగదు అప్పుగా తీసుకున్నారు. ఆ సొమ్ము తిరిగి చెల్లించక పోవడంతో చెక్‌బౌన్స్ కేసు ద్వారా అప్పలనాయుడికి రెండేళ్లు, లక్ష్మికి ఏడాది జైలుశిక్ష విధించినట్లు ఆయన తెలిపారు.
నగలు, నగదు చోరీపై ఫిర్యాదు
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో చెరువు గట్టు వీధిలో నివాసం ఉంటున్న పిల్లి రాము ఇంట్లో చోరీ జరిగిన ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పార్వతీపురం పట్టణ పోలీసులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తన భార్య బంధువుల ఇంటికి వెళ్లడంతో ఇంటికి తాళం వేసి తన రోజువారీ పనుల నిమిత్తం చంటి బయటకు వెళ్లగా తిరిగి వచ్చి చూసేసరికి వేసిన తాళం వేసినట్లు ఉండి ఇంట్లో ఉన్న బీరువా తెరిచి బట్టలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో దొంగతనం జరిగినట్లు పిల్లి రాము గుర్తించారు. ఈ చోరీలో ఐదు తులాల బంగారు ఆభరణాలతో పాటు, రూ.12 వేల నగదు అపహరించినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

కొట్టిశలో ఎకై ్సజ్ శాఖ దాడులు