
నేడు మడ్డువలస నీరు విడుదల
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ఖరీఫ్ సీజన్‌కు సాగునీటిని విడిచిపెట్టనున్నట్లు ఏఈ నితిన్ తెలిపారు. రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ చేతుల మీదుగా స్విచ్ ఆన్ చేసి నీటి విడుదల చేపడతామని వెల్లడించారు.
ఆయకట్టు వివరాలు ఇలా..
ఈ ఏడాది ఆయకట్టు పరిధి ఆరు మండలాల్లో 30,077 ఎకరాలకు సాగునీటి సరఫరాను అధికారులు చేపట్టనున్నారు. వంగరలో 996 ఎకరాలు, రేగిడిలో 6777 ఎకరాలు, సంతకవిటిలో 10976 ఎకరాలు, జి.సిగడాంలో 6029 ఎకరాలు, పొందూరులో 99 ఎకరాలు, లావేరులో 5200 ఎకరాల ఆయకట్టు భూములకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సాగునీటి విడుదల చేపట్టనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు పరిస్థితి ఇది..
మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది సాగునీటి విడుదల జాప్యమైందని చెప్పకతప్పదు. ఏటా జూన్ నెలలో నీటి విడుదల చేపట్టే పరిస్థితి ఉండేది. అయితే ఈ ఏడాది ప్రాజెక్టులో నీటి విడుదలకు సరిపడ నీరు నిల్వ ఉన్నప్పటికీ నీటిని విడుదల చేయడంలో అధికారుల అలసత్వంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీటి సామర్థ్యం..
ప్రాజెక్టులో ఆదివారం 64.62 మీటర్ల లెవెల్‌లో నీటిమట్టం నమోదైంది. ఈ లెక్కన 3.008 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 65 మీటర్లు కాగా ఆ స్థాయికి 3.337 మీటర్లు నిల్వ ఉండాల్సి ఉంది. అయితే ఈ లెక్కన ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యానికి 00.34 మీటర్ల దూరంలో ఉంది. పుష్కలంగా ఆయకట్టుకు సాగునీరు విడుదలకు అవసరమైన నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.
చర్యలు చేపట్టిన అధికారులు