
బదిలీల్లో నిబంధనలు అతిక్రమించొద్దు
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్:
సచివాలయ సిబ్బంది బదిలీలు పారదర్శకంగా జరగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలను అతిక్రమించరాదని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు. నిబంధనల ప్రకారంగా బదిలీలను చేపట్టి నోటీసుబోర్డులో ప్రదర్శించాలన్నారు. అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించాలని సూచించారు. ఎటువంటి అక్రమాలు జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
విజన్–2047పై సమీక్ష
జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత ఆధ్వర్యంలో ఈ నెల 3న ఉదయం 11 గంటలకు విజన్–2047 ప్రణాళికపై సమీక్ష సమావేశం జరగనుందని కలెక్టర్ తెలిపారు. మంత్రి సమీక్ష కోసం ప్రాథమిక, సేవారంగం, పారిశ్రామిక రంగాల జిల్లాస్థాయి ప్రణాళికపై సీపీఓ నోట్ తయారుచేయాలన్నారు. నియోజకవర్గాల ఇన్‌చార్జిలు నియోజకవర్గ స్థాయి ప్రణాళికలను రూపొందించి ఒక రోజు ముందే అందజేయాలన్నారు.