
535 ఎంఎస్‌పీలకు స్థానచలనం
విజయనగరం క్రైమ్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన 535 మంది మహిళా సంరక్షణ పోలీసుల(ఎంఎస్‌పీ)కు స్థానచలనం కలిగినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో సోమవారం రాత్రి 10 గంటల వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ సాగింది. ఎస్పీతో పాటు ఏఎస్పీ సౌమ్యలత కౌన్సెలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. రోగులైన వారు, వైవాహిక పరిస్థితులు, విజువల్ ఇంప్లైయిడ్, తదితర అంశాలపై బదిలీల్లో పరిగణనలోకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. మొత్తం 635 మందికి 535 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి వార్డు/గ్రామ సచివాలయాలను కేటాయించామన్నారు. కలెక్టర్ ఉత్తర్వులు మేరకు బదిలీ ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లో విడు దల చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ ఏఓ శ్రీనివాసరావు, ఎస్‌బీ సీఐలు లీలారావు, చౌదరి, సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, ఎస్‌ఐ ప్రభావతి, ఆర్‌ఎస్‌ఐలు నీలిమ, మంగలక్ష్మి, డీపీఓ సిబ్బంది తేజ, రాంబాబు, శ్రీనివాసరావు, సుధారాణి, హేమంత్, పీఆర్వో కోటేశ్వరరావు, ఐటీ కోర్ టీమ్ పాల్గొన్నారు.