
సర్పంచ్ ఆరోగ్యంపై ఆరా
విజయనగరం ఫోర్ట్: ఇటీవల ప్రమాదానికి గురై విజయనగరంలోని మెడికర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భీమిలి నియోజకవర్గం పద్మనాభం సర్పంచ్ తాలాడ పద్మనాభంను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు సోమవారం పరామర్శించారు. పద్మనాభం ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పద్మనాభం మండల ఎంపీపీ కె.రాంబాబు, యూత్ ప్రెసిడెంట్ బుగత సత్య నారాయణ, చీపురుపల్లి జెడ్పీటీసీ సభ్యుడు వలిరెడ్డి శ్రీను, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పి.సత్యనారాయణ ఉన్నారు.
సచివాలయ ఏఎన్‌ఎంలకు బదిలీ కౌన్సెలింగ్
విజయనగరం ఫోర్ట్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సచివాలయం ఏఎన్‌ఎంలకు జూమ్‌లో సోమవారం బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు. విజయనగరం డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి, పార్వతీపురం డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కరరావు, ఏఓ ప్రభూజీ, సూపరింటెండెంట్ నాగరాజు కౌన్సెలింగ్ నిర్వహించారు.
మడ్డువలసలో ఏనుగులు తిష్ట
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు పరిసరాల్లో తొమ్మిది ఏనుగులు తిష్టవేశాయి. చెరకు, వరినారు మడులను ధ్వంసం చేస్తున్నాయి. వంగర–రాజాం రోడ్డు పక్కన సోమవారం సంచరించడంతో అటవీ, పోలీస్ శాఖ సిబ్బంది అప్రమత్తమై రాకపోకలను కాసేపు నిలిపివేశారు. పార్వతీపురం మన్యం జిల్లా అటవీశాఖ రేంజర్ మణికంఠేశ్వరరావు, సిబ్బంది ఏనుగుల గమనాన్ని పరిశీలిస్తూ గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
● డీఈఐసీ వైద్యాధికారి ఆదిత్య శేషసాయి
విజయనగరం ఫోర్ట్: విద్యార్థులకు విద్యాబోధనతోపాటు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డీఈఐసీ (జిల్లా సత్వర చికిత్స కేంద్రం) వైద్యులు డాక్టర్ ఉండవల్లి ఆదిత్య శేషసాయి సూచించారు. మహారాణిపేట బాలసదన్‌లోని విద్యార్థులకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులు అందజేశారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై దృష్టి సారించగలరన్నారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలపట్ల అశ్రద్ధ చూపొద్దని సూచించారు. కార్యక్రమంలో వైద్యుడు బి.చక్రవర్తి, సోషల్ వర్కర్ వై.శ్రీనివాస్‌రావు, బాలసదన్ మేనేజర్ శోభారాణి పాల్గొన్నారు.

సర్పంచ్ ఆరోగ్యంపై ఆరా

సర్పంచ్ ఆరోగ్యంపై ఆరా

సర్పంచ్ ఆరోగ్యంపై ఆరా