
● రేషన్ కష్టాలు
రేషన్ కోసం వరండాలో
నిరీక్షిస్తున్న లబ్ధిదారులు
గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఇంటింటికీ రేషన్ పంపిణీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం నిలుపుదల చేయడంతో లబ్ధిదారులకు ప్రతినెలా కష్టాలు తప్పడం లేదు. పనులు మానుకుని రేషన్ కోసం గంటల తరబడి డిపోల వద్ద నిరీక్షిస్తున్నారు. గతంలో వలే ఇంటివద్దకే వచ్చి సరుకులు అందజేస్తే ఈ కష్టాలు ఉండేవి కావని చెబుతున్నారు. రేషన్ కోసం విజయనగరంలోని ధర్మపురి వద్ద నిరీక్షిస్తున్న లబ్ధిదారులను చిత్రంలో చూడొచ్చు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం