
మడ్డువలసలోనే ఏనుగులు
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు సమీపంలో తొమ్మిది ఏనుగుల గుంపు తిష్ఠవేసింది. గత మూడు రోజులుగా సంగాం గ్రామ పరిసరాల్లోని చెరకు, పామాయిల్ తోటల్లో సంచరిస్తూ ధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఏనుగుల తరలించాలని రైతులు కోరుతున్నారు.
అప్రమత్తంగా అధికారులు.....
ఏనుగులు గుంపు వంగర–రాజాం రోడ్డు మార్గం ఆనుకొని ఉండడంతో అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. రోడ్డుపై వెళుతున్న వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రోడ్డు మార్గంలో వాహనాలు నిలుపుదల చేస్తున్నారు.