
హోటల్స్‌పై విజిలెన్స్ దాడులు
రాజాం సిటీ: పట్టణంలోని పలు హోటల్స్‌లో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ను హోటల్స్‌లో అక్రమంగా వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు చేపట్టామని విజిలెన్స్ ఎస్సై రామారావు తెలిపారు. మూడు హోటల్స్‌లో రూ.24,432లు విలువ చేసే 10 సిలిండర్లు సీజ్ చేయడంతో పాటు 6ఎ కేసులు నమోదుచేశామన్నారు. ఈ దాడుల్లో హెచ్‌సీ కామేశ్వరరావు, పురుషోత్తం, కన్నబాబు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
6న చెస్‌పోటీలు
సాలూరు: ఆంధ్రా చెస్ అసోసియేషన్ తరఫున సాలూరు పట్టణంలోని చినబజారు వద్ద గల ఆర్యవైశ్యధర్మశాలలో ఈ నెల 6న చెస్‌పోటీలను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కో ఆర్డినేటర్ తిరుమలేష్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.16 సంవత్సరాల లోపు బాల బాలికలకు నిర్వహించే ఈ పోటీలను బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 8008008272,9182337499 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
మహిళలకు ఉచిత శిక్షణ
విజయనగరం అర్బన్: నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించే పలు కోర్సులకు ఉచిత శిక్షణా తరగతులను స్థానిక మహిళా ప్రాంగణంలోని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ వసతిగృహంలో నిర్వహిస్తామని సంస్థ డైరెక్టర్ డి.భాస్కరరావు బుధవారం తెలిపారు. పురుషుల కోసం 30 రోజుల సెల్‌ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసు కోర్సు, లైట్ మోటార్ వెహికల్ ఓనర్ డ్రైవర్ కోర్సులపై శిక్షణ ఉంటుందని తెలిపారు. వసతి భోజన సౌకర్యాలను ఉచితంగా కల్పించే ఈ కోర్సులకు తెల్లకార్డుదారులు, 45 ఏళ్లలోపున్న గ్రామీణ ప్రాంత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఆ నెల 15వ తేదీ లోపు దరఖాస్తులను కార్యాలయానికి పంపాలని కోరారు. పూర్తి వివరాల కోసం 9959521662, 9985787820 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
అయ్యరకులకు తీవ్ర అన్యాయం●
● కులస్తుల రాష్ట్ర అసోషియేషన్
అధ్యక్షుడు పీఎస్‌ఎన్ పాత్రుడు
కొత్తవలస: కూటమి ప్రభుత్వం అయ్యరక కులస్తులకు తీవ్ర అన్యాయం చేస్తోందని, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నేటికీ అయ్యరక కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమని ఆ కులస్తుల రాష్ట్ర ఆసోసియేషన్ అధ్యక్షుడు పీఎస్‌ఎన్ పాత్రుడు అన్నారు. ఈ మేరకు కొత్తవలస మండలంలోని కొత్తసుంకరపాలెం గ్రామంలో ఆయన స్థానిక విలేకరులతో బుధవారం మాట్లాడారు. అయ్యరక కులస్తులకు ఓసీ రిజరేషన్ ఉండగా అనాటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేకరరెడ్డి చలించి బీసీ రిజరేషన్ కల్పించి అక్కున చేర్ఛుకున్నారని గుర్తుచేవారు. అదేవిధంగా ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అయ్యరక కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక చైర్మన్, 11 మంది డైరెక్టర్లను నియమించి సముచిత స్థానం కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో అయ్యరక కులస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేద వ్యక్తం చేశారు. 2014–19 చంద్రబాబు పాలనలో అయ్యరక కులస్తులను కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన పూర్తయినా నేటికీ తమ కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేకపోవడం వద్ద తమ కులస్తులను చిన్నచూపు చూసి అవమాన పరుస్తున్నారన్నారు. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది అయ్యరక కులస్తులు ఉన్నారని గుర్తు చేశారు. వారంతా తిరగబడకక ముందే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అయ్యరక కార్పొరేషన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం తప్పదని హెచ్చరించారు.

హోటల్స్‌పై విజిలెన్స్ దాడులు