
అక్రమ గ్రావెల్ తవ్వకాలకు జరిమానా
నెల్లిమర్ల రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం బోడికొండను సీతారామునిపేట జంక్షన్ వద్ద పలువురు అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్న అంశంపై గత నెల 27న ‘రామయ్యా..చూడవేమయ్యా..! శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై అధికార యంత్రాంగం స్పందించింది. రెవెన్యూ, మైనింగ్, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి బుధవారం వెళ్లి పరిశీలించారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు నిర్ధారించి తవ్వకాలపై ఆరా తీశారు. తంగుడుబిల్లి గ్రామానికి చెందిన రామారావు అనే వ్యక్తికి రూ.15 వేలు జరిమానా విధించారు. గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సతీష్, వీఆర్వో షలీమా, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమ గ్రావెల్ తవ్వకాలకు జరిమానా