
ఫీల్డ్ అసిస్టెంట్స్‌కు బకాయి జీతాలివ్వాలి
విజయనగరం ఫోర్ట్: ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరినీ రెన్యువల్ చేసి వెంటనే బకాయి ఉన్న మూడు నెలల జీతాలు ఇప్పించాలని ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్. రాజారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మ్యాన్ డేస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సస్పెన్షన్‌కు గురైన ఫీల్డ్ అసిస్టెంట్స్‌ను విధుల్లోకి తీసుకోవాలని ఎన్‌ఎంఎంఎస్‌యాప్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి సాంకేతిక లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. టార్గెట్ పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్స్‌పై పని ఒత్తిడిని పెంచే విధానాన్ని విడనాడాలని కోరు. కార్యక్రమంలో లక్ష్మి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ విజ్ఞప్తి