
● నిరసన గళం
వివిధ సమస్యలపై జిల్లా ప్రజలు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక సాక్షిగా ఆందోళనలు చేశారు. తమ నిరసనగళం వినిపించారు. విజయనగరానికి సమీపంలో గుంకలాం వద్ద ఉన్న వైఎస్సార్‌జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. తక్షణమే రాకపోకలకు వీలుగా సీసీ రోడ్లు, కాలువలు నిర్మించాలని, వీధి దీపాలు అమర్చాలని, తాగునీటి బోర్లు వేయాలని, వైద్యసేవలు అందేలా ఆరోగ్య సబ్ సెంటర్ నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జేసీ సేతుమాధవన్‌కు వినతిపత్రం అందజేశారు. తమ కాలనీ ప్రజల కష్టాలపై మీడియా సాక్షిగా గోడు వినిపించారు.సిబిల్‌స్కోర్ పేరుతో రుణాలు నిలిపివేయడం తగదంటూ నాయీబ్రాహ్మణులు ఆందోళన చేశారు. వృత్తిలో శిక్షణపొందిన వారికి టూల్‌కిట్‌లు అందజేయాలని, స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ ఏపీ నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు.
– విజయనగరం అర్బన్

● నిరసన గళం