జిల్లాలో మరో రెండు కోవిడ్ కేసులు
● మూడుకు చేరిన కోవిడ్ కేసుల సంఖ్య
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. చాపకింద నీరులా వ్యాధి వ్యాప్తి చెందుతోంది. జిల్లాలో ఇప్పటికే ఒక కోవిడ్ కేసు నమోదు కాగా, తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో కోవిడ్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. బాడంగి మండలం పెదపల్లి గ్రామానికి ఓ వ్యక్తి, జామి మండలం రామభద్రపురానికి చెందిన ఓ వ్యక్తి కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ ఈ నెల 6వ తేదీన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రి సిబ్బంది వీరిద్దరి శాంపిల్ తీసి ఆర్‌టీపీసీఆర్ పరీక్ష కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు పంపించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో జిల్లా ప్రజల్లో భయం పెరుగుతోంది.
పీఆర్, ఆర్డీలో బదిలీలు
సాక్షి, పార్వతీపురం మన్యం: పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ విభాగంలో భారీగా బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా పంచాయతీ అధికారి టి.వెంకటేశ్వర్లకు విశాఖపట్నంలోని డ్వామా కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా బదిలీ అయింది. ఆయన స్థానంలో డీవీ మల్లికార్జునరావును డీపీఓగా నియమించారు. పార్వతీపురం మన్యం జిల్లా గ్రామ పంచాయతీ అధికారి టి.కొండలరావును బదిలీ చేస్తూ.. తదుపరి పోస్టింగు కోసం ఆ శాఖ కమిషనర్‌కు రిపోర్ట్ చేయాల్సిందిగా పేర్కొన్నారు. ఆయన స్థానంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా విశాఖ నుంచి డ్వామాలో ఫైనాన్స్ మేనేజర్ (డీడీవో) ఎస్.రవీంద్రను నియమించారు. విజయనగరం డివిజనల్ పంచాయతీ అధికారిగా ఆర్.శిరీషరాణిను నియమించారు. ఇప్పటి వరకూ ఆమె అనకాపల్లిలో పని చేస్తున్నారు. విజయనగరం డ్వామా పీడీ ఇ.సందీప్‌ను అనకాపల్లికి బదిలీ చేశారు.
కదం తొక్కిన కార్మిక సంఘాలు
● కలెక్టరేట్ వద్ద రాస్తారోకో
విజయనగరం గంటస్తంభం: కాంట్రాక్టు కార్మికుల అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపాలి.. వెంటనే విధులోకి తీసుకోవాలి.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించడంతో పాటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు కదం తొ క్కాయి. విజయనగరం కలెక్టరేట్ వద్ద సోమ వారం రాస్తోరోకో నిర్వహించాయి. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్మి కె.సుబ్బరామమ్మ, ఏఐఎఫ్‌టీయూ నాయకుడు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు, పోరాటాలు, బలిదానం ఫలితంగా వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి దోపిడీదార్లకు కట్టబెట్టే ప్రయత్నం దుర్మార్గమన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగని వ్వమని ఓట్లు వేయించుకొని, అధికారంలోనికి వచ్చిన తర్వాత మాట్లాడకపోవడం వారి తీరుకు నిదర్మనమన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్ర ధాన కార్యదర్మి కె.సురేష్, టి.వి.రమణ, వి. లక్ష్మి, బి.రమణ, బి.సూర్యనారాయణ, బి.సుధారాణి, ఎం.రమణ, బి.రమణ, ముత్యాలు, పెంటరాజు, శ్రీను, రమణమ్మ పాల్గొన్నారు.


