దగాకోరు పాలన...
స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టండి.. విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు.. అని చెప్పిన నారా లోకేశ్.. అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్ల బిగించు తున్నారు. విశాఖఉక్కు కర్మాగారం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చొరవచూపుతున్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఫుడ్ కోర్టు, సాగునీటి ప్రాజెక్టుల పనులను విస్మరించారు. నిరుద్యోగ భృతి, విద్యార్థులకు విద్యా దీవెన, తల్లికి వందనం ఇవ్వలేదు. విద్యుత్ చార్జీలు పెంచారు. కుళాయి చార్జీలు రెట్టింపు చేశారు. కూటమిది దగాకోరు పాలన.
– రెడ్డి శంకరరావు, పట్టణ పౌర సంక్షేమ
సంఘం అధ్యక్షుడు, విజయనగరం
సాగుకు భరోసా లేదు..
గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లూ క్రమంతప్పకుండా వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద రూ.13,500 చొప్పున అందించింది. వాటితో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుని వ్యవసాయం చేసుకునేవాళ్లం. కూటమి ప్రభు త్వం వచ్చి ఏడాది అయినా ఇంతవరకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు.
– పొటుపురెడ్డి అప్పలనాయుడు, రైతు, పెదవేమలి గ్రామం
వైద్య కష్టాలు ఆరంభం
కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడంలేదు. ఫ్యామిలీ డాక్టర్ సేవలు పారదర్శకంగా అందడంలేదు. గత ప్రభుత్వం జిల్లాకు వైద్యకళాశాల మంజూరు చేసి ప్రజలకు భరోసా కల్పించింది.
– ఎన్. సన్యాసిరావు,
సామాజిక కార్యకర్త, నరవ గ్రామం
అభివృద్ధి శూన్యం
రాజాం–పాలకొండ రోడ్డు ప్రమాదకరంగా మారింది. గతంలో అధికారులు గోతులైనా పూడ్చేవారు. ఇప్పుడు అదికూడా లేదు. అధికారంలోకి వచ్చినవెంటనే రోడ్డును నిర్మించేస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబునాయుడు ఇంతవరకూ ఈ రోడ్డు పనులు పూర్తిచేయలేదు. రాజాం మండలంతో పాటు పట్టణంలో ఎటువంటి అభివృద్ధిలేదు.
– లావేటి రాజగోపాలనాయుడు, వైఎస్సార్‌సీపీ రాజాం మండలాధ్యక్షుడు, రాజాం
నాడు చదువుల విప్లవం.. నేడు సమస్యల రాజ్యం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో విద్యార్థులకు చేసిందేమీ లేదు. వసతిదీవెన నిలుపుదల చేసింది. విద్యాదీవెన బకాయిలు విడుదలచేయలేదు. గత ప్రభుత్వం మెడికిల్ కాలేజీలను తీసుకొస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ విద్యార్థులకు చదువును భారంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. వైద్యవిద్యను వ్యాపారంగా మార్చేసింది. గత ప్రభుత్వం చదువుల విప్లవం సృష్టిస్తే.. కూటమి ప్రభుత్వం సమస్యల విప్లవం తెచ్చిపెట్టింది.
– డి.రాము, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు, విజయనగరం
దగాకోరు పాలన...
దగాకోరు పాలన...
దగాకోరు పాలన...
దగాకోరు పాలన...


