
సుర్రుమంటున్న సూరీడు..!
● విలవిల్లాడుతున్న వన్యప్రాణులు
● వేసవిలో ఇబ్బందుల్లేకుండా అటవీశాఖ చర్యలు
● అభయారణ్యంలో పుష్కలంగా
నీటివసతులు
● జంతువుల కోసం నీటికుంటలు,
చెక్‌డ్యామ్‌లు, చెలమలు
● తాగునీటి కోసం గ్రామాలకు
రాకుండా అడవిలోనే ఏర్పాట్లు
వన సంపదపై ప్రజలకు అవగాహన
వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడుకునేందుకు సమీప అటవీ గ్రామాల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ‘వన్యప్రాణుల చట్టం–1972’ గురించి వివరిస్తున్నాం. వన్యప్రాణులను చంపితే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలియజేస్తున్నాం. అలాగే అటవీ సిబ్బందితో ప్రతినిత్యం పెట్రోలింగ్ చేస్తున్నాం. పటిష్ట చర్యలు చేపట్టడంతో వన్యప్రాణులను కాపాడుకోగలుగుతున్నాం. వన్యప్రాణులు తాగునీటికి ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వన్యప్రాణులను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రభుత్వం కూడా వన్యప్రాణులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. వేసవిలో వన్యప్రాణుల దాహం తీర్చడానికి అటవీశాఖ ద్వారా చేపట్టే చర్యలు చాలా అవసరం. అయితే వన్యప్రాణులు మైదాన ప్రాంతాలకు వస్తున్నప్పుడు వేటగాళ్ల బారిన పడుతున్నాయి. కాబట్టి, అటవీశాఖతో పాటు ప్రజలు కూడా వన్యప్రాణులను కాపాడడానికి సహకరించాలి. దాహం కోసం జంతువులు అడవిని వీడి నీటి జాడలు వెతుక్కుంటూ గ్రామాల్లోకి వస్తుంటాయి. ప్రజలు వాటికి హాని తలపెడితే శిక్షార్హులవుతారు. – విజయనగరం జిల్లా అటవీశాఖ అధికారి ఆర్.కొండలరావు

సుర్రుమంటున్న సూరీడు..!

సుర్రుమంటున్న సూరీడు..!

సుర్రుమంటున్న సూరీడు..!