సేవల్లో వెనుకబడిన.. ఏపీవీపీ ఆసుపత్రులు..! | - | Sakshi
Sakshi News home page

సేవల్లో వెనుకబడిన.. ఏపీవీపీ ఆసుపత్రులు..!

May 4 2025 8:05 AM | Updated on May 4 2025 8:05 AM

సేవల్

సేవల్లో వెనుకబడిన.. ఏపీవీపీ ఆసుపత్రులు..!

బీ గ్రేడ్‌లో ఆరు ఆసుపత్రులు

సీ గ్రేడ్‌లో చీపురుపల్లి ఆసుపత్రి

ఓపీ, ఐపీ సేవల్లోనూ వెనుకబాటే..

జిల్లాలో ఏడు ఏపీవీపీ ఆసుపత్రులు

అన్ని ఆసుపత్రుల్లో తగ్గిన సేవలు

డెప్యూటేషన్‌పై కాలయాపన చేస్తున్న

కొందరు వైద్యులు

విజయనగరం ఫోర్ట్‌: వైద్య విధాన్‌ పరిషత్‌ ఆసుపత్రులు సేవల్లో వెనుకబడ్డాయి. ప్రభుత్వం ప్రతీ నెల ప్రకటించే గ్రేడ్‌ల్లో ఈ విషయం తేటతెల్లమైంది. అన్నీ ఆసుపత్రుల్లోనూ సేవలు తగ్గాయి. కూటమి ప్రభుత్వం వైద్య శాఖను పట్టించుకోకపోవడం వల్ల ఆసుపత్రులు గాడి తప్పాయని విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది వైద్య సిబ్బంది డెప్యూటేషన్ల పేరుతో కాలయాపన చేయడం వల్ల కూడా సంబంధిత ఆసుపత్రుల్లో సేవలు పూర్తి స్థాయిలో అందకపోవడం వల్ల సేవల్లో వెనుకంజలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓపీ, ఐపీ సేవల్లో కూడా ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు. జిల్లాలో వైద్య విధాన్‌ పరిషత్‌ ఆస్పత్రులు ఏడు ఉన్నాయి. వాటిలో ఎస్‌.కోట ఏరియా ఆసుపత్రి, గజపతినగరం ఏరియా ఆసుపత్రి, బాడంగి, బొబ్బిలి, చీపురుపల్లి, భోగాపురం, నెల్లిమర్ల సీహెచ్‌సీలు ఉన్నాయి.

బీ గ్రేడ్‌లో ఆరు ఆసుపత్రులు

2025 మార్చి నెలలో ప్రభుత్వం ఆసుపత్రులకు గ్రేడ్‌లను ప్రకటించింది. ఆసుపత్రులు అందించే సేవలు అధారంగా ఏ, బీ, సీ గ్రేడ్‌లు ప్రకటిస్తారు. జిల్లాలో ఆరు ఆసుపత్రులకు బీ గ్రేడ్‌ ఇవ్వగా, ఒక ఆసుపత్రికి సీ గ్రేడ్‌ ఇచ్చారు. చీపురుపల్లి ఆసుపత్రికి సీ గ్రేడ్‌ ఇవ్వగా.. ఎస్‌.కోట, గజపతినగరం, భోగాపురం, నెల్లిమర్ల, భోగాపురం, బొబ్బిలి ఆసుపత్రులకు బీ గ్రేడ్‌ ఇచ్చారు.

ఏరియా ఆసుపత్రి, సీహెచ్‌సీల్లో అందించే సేవలు

ఏరియా ఆసుపత్రి, సీహెచ్‌సీల్లో గైనిక్‌, పిడియాట్రిక్‌, ఎముకలు, కంటి, దంత, జనరల్‌ సర్జరీ తదితర విభాగాలకు చెందిన రోగులను పరీక్షించి ఓపీ సేవలు అవసరమైన ఓపీ సేవలు అందిస్తారు. ఇన్‌పేషేంట్‌ సేవలు అవసరమైన ఇన్‌పేషేంట్‌గా ఆస్పత్రిలో చేర్పించి సేవలు అందిస్తారు. అదే విధంగా గర్భిణులకు వైద్య తనిఖీలతో పాటు ప్రసవాలు, సిజేరియన్లు చేస్తారు. రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు, ఈసీజీ, ఎక్సరే వంటి సేవలు అందిస్తారు.

డెప్యూటేషన్లతో కాలయాపన

వైద్య విధాన్‌ పరిషత్‌లోని కొంత మంది వైద్యులు డెప్యూటేషన్లపై కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యవిధాన పరిషత్‌కు సంబంధించి ఇద్దరు వైద్యులు డెప్యూటేషన్‌పై డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయంలో పని చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయా ఆసుపత్రుల్లో సంబంధిత వైద్యులు అందించాల్సిన సేవలు రోగులకు పూర్తి స్థాయిలో అందడం లేదని రోగులు వాపోతున్నారు.

సేవల్లో వెనుకబడిన.. ఏపీవీపీ ఆసుపత్రులు..!1
1/1

సేవల్లో వెనుకబడిన.. ఏపీవీపీ ఆసుపత్రులు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement