ఇళ్ల స్థలాల పంపిణీలో జాప్యం | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల స్థలాల పంపిణీలో జాప్యం

Apr 23 2025 8:01 PM | Updated on Apr 23 2025 8:01 PM

ఇళ్ల

ఇళ్ల స్థలాల పంపిణీలో జాప్యం

విజయనగరం గంటస్తంభం: కార్పొరేట్లకు లక్షల ఎకరాలు ధారాదత్తం చేస్తున్న కూటమి పాలకులు పేదోడికి 2 సెంట్లు ఇంటి స్థలం అడిగితే లేదని చెప్పడం చంద్రబాబు మోసకారితనానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటివరకూ పేదలకు ఇళ్ల నిర్మాణం, స్థలాల మంజూరుకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న ఆశ సామాన్య కుటుంబాలకు అందని ద్రాక్షగా మిగింలిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్మి వర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో 2సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్ధలాలు ఇచ్చి ఇంటి నిర్మాణనికి రూ.5 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. ప్రస్తుతం ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఉన్న చోటే పట్టాలు మంజూరు చేయాలి. అర్హులైన వారికి రేషన్‌ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టారు. అనంతరం డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ.

సర్వేల పేరిట కాలక్షేపం

సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందిస్తే ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. సర్వేల పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సాయం పెంచడంతో ఇల్లు కట్టుకునేందుకు సొంత స్ధలం ఉన్నవారు చాలామంది ముందుకొస్తున్నారన్నారు. గ్రామాల్లో ఇంకా గృహ నిర్మాణాలకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదని అధికారులు చెబుతున్నారు. 2014–19 టీడీపీ పాలనలోనే ఇదే పరిస్ధితి నెలకొంది. తొలుత మూడేళ్లపాటు ఇళ్ల నిర్మాణాలకు అవకాశం ఇవ్వకుండా తర్వాత ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి 2019 ఎన్నికలు దగ్గరపడ్డాయి. టీడీపీ ఓటమి పాలైంది. ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు.పేదలకు రెండు సెంట్లు, మూడు సెంట్లు, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు అని చెప్పి ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పూర్తిగా అప్పగించకుండా నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్మించారు. ఇళ్ళ స్థలాలు, ఇంటి పట్టాలు పేదలు నివసించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్‌, ఆనందరావు, ఎస్‌.రంగరాజు, కోట అప్పన్న, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్‌లకు లక్షల ఎకరాలు ధారబోత

ఇంటిస్థలం ఇచ్చేవరకు పోరాటం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు

ఈశ్వరయ్య

ఇళ్ల స్థలాల పంపిణీలో జాప్యం1
1/1

ఇళ్ల స్థలాల పంపిణీలో జాప్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement