సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో క్యాంపస్‌ డ్రైవ్‌ రేపు | - | Sakshi
Sakshi News home page

సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో క్యాంపస్‌ డ్రైవ్‌ రేపు

Apr 14 2025 1:05 AM | Updated on Apr 14 2025 1:05 AM

సత్య

సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో క్యాంపస్‌ డ్రైవ్‌ రేపు

విజయనగరం అర్బన్‌: పట్టణంలోని సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఈ నెల 15న డక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ పూల్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవీ సాయిదేవమణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొడక్షన్‌ విభాగంలో ట్రైనీ కెమిస్ట్‌ పొజిషన్‌ కోసం బీ ఎస్సీ కెమిస్ట్రీ మరియు సీబీజెడ్‌, డిప్లమా మెకానికల్‌, బీటెక్‌ మెకానికల్‌ పాసైన, ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న చివరి సెమిస్టర్‌ వరకు బ్యాక్‌లాగ్స్‌ లేని పురుషులు 18 నుంచి 27 సంవత్సరాల వయస్సు ఉన్న వారు మాత్ర మే అర్హులని తెలిపారు. ఎంపికై న వారు తుని లోని బ్రాంచ్‌లో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు నేరుగా కళాశాల ప్రాంగణానికి పూర్తి బయోడే టా, ధ్రువపత్రాలు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోల తో హాజరు కావాలని సూచించారు. పేర్ల నమో దుకు 7012393316, 9032772661 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు.

రక్తదానంతో ప్రాణదానం

విజయనగరం టౌన్‌: రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అపోహలు విడనాడి రక్తదానానికి ముందుకు రావా లని విజయనగరం యూత్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు షేక్‌ ఇల్తామాష్‌ కోరారు. నగరంలోని బీసీ కాలనీలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లాలో రక్తం నిల్వల కొరత కారణంగా తలసీమియా పిల్లలు, గర్భిణుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. రక్తదానం చేసిన 30 మందిని సత్కరించారు. శిబిరంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, శరత్‌, అశోక్‌, సాయి, రఘు, సాయిప్రసాద్‌, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా 16న ర్యాలీ

విజయనగరం టౌన్‌: వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీన తలపెట్టిన భారీ ర్యాలీ కి సంబంధించి జిల్లా ముస్లిం సమాఖ్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆబాద్‌వీధిలో ఉన్న కార్యాలయంలో ఆదివారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకుడు ఆబ్దుల్‌ కరీమ్‌ మాట్లాడుతూ వక్ఫ్‌ ఆస్తులను పరిరక్షించాలని, ముస్లింలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పని చేయడం దారుణమన్నారు. వక్ఫ్‌ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం కలుగు తుందన్నారు. మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు షరీఫ్‌, ముస్తఫా, జాకీర్‌ హుస్సేన్‌, మొహమ్మద్‌ నిజాం, అన్సర్‌, చిస్తి తదితరులు పాల్గొన్నారు.

కనుల పండువగా

శ్రీవారి చక్రస్నానాలు

రాజాం : మండలంలోని అంతకాపల్లి గ్రామంలో వెలసిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీపద్మావతి గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీనివాసుని ఉత్స వ విగ్రహాలకు మిధున లగ్నంలో చక్రస్నానా లు నిర్వహించారు. కనుల పండువగా జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎంఆర్‌ కుటుంబసభ్యులతో పాటు టీటీడీ ఏఈఓ జి. జగన్మోహన్‌ఆచార్య, ఆలయ పర్యవేక్షకులు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

నేడు డా. బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి

పార్వతీపురం టౌన్‌: భారత రాజ్యాగ నిర్మాత డా. బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సోమవారం నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు తన కార్యాలయంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళితో కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందన్నారు. అనంతరం సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో క్యాంపస్‌ డ్రైవ్‌ రేపు 1
1/2

సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో క్యాంపస్‌ డ్రైవ్‌ రేపు

సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో క్యాంపస్‌ డ్రైవ్‌ రేపు 2
2/2

సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో క్యాంపస్‌ డ్రైవ్‌ రేపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement