బైక్‌లు ఢీకొని మహిళకు గాయాలు
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటణలో ఓ మహిళ తీవ్ర గాయాలపాలైంది. సోమవారం కురుపాం మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కురుపాం మండలం జి.శివడ గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై బి.జీవిరావు, భార్య ప్రియతో కలిసి కురుపాం వస్తుండగా..కురుపాం నుంచి చందు అనే యువకుడు ద్విచక్రవాహనంపై గుమ్మలక్ష్మీపురం వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యంలోని మూలిగూడ జంక్షన్ వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రియకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన ప్రియను కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా వైద్యసేవలు అందించారు. సంఘటనపై కురుపాం పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.


