డిప్యుటేషన్‌ ద్వారా ‘డైట్‌’ అధ్యాపక ఖాళీల భర్తీ | - | Sakshi
Sakshi News home page

డిప్యుటేషన్‌ ద్వారా ‘డైట్‌’ అధ్యాపక ఖాళీల భర్తీ

Apr 2 2025 12:39 AM | Updated on Apr 3 2025 1:16 AM

డిప్యుటేషన్‌ ద్వారా ‘డైట్‌’ అధ్యాపక ఖాళీల భర్తీ

డిప్యుటేషన్‌ ద్వారా ‘డైట్‌’ అధ్యాపక ఖాళీల భర్తీ

విజయనగరం అర్బన్‌: డైట్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న బోధన సిబ్బందిని ఫారిన్‌ సర్వీస్‌ నియామక నిబంధనల మేరకు డిప్యుటేషన్‌ పద్ధతిలో నియామకం చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు డీఈఓ యు.మాణిక్యం నాయుడు మంగళవారం విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న స్కూల్‌ అసిస్టెంట్‌, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. డీఈఓల ద్వారా సంబంధిత ప్రిన్సిపాల్స్‌కు దరఖాస్తులు సమర్పించుకోవాలి. 11 నుంచి 13వ తేదీల మధ్యలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. అర్హత పొందిన దరఖాస్తుదారులకు ఈ నెల 16, 17వ తేదీల్లో రాత పరీక్ష, 19వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అర్హులైన వారికి డిప్యుటేషన్‌ ఉత్తర్వులు ఈ నెల 21వ తేదీన అందజేస్తారు. 22వ తేదీనే విధుల్లో చేరాలని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ‘డీఈఓ విజయనగరం’ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

16, 17వ తేదీల్లో రాత పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement