● స్పెషల్ జడ్జి కె.నాగమణి
విజయనగరం అర్బన్: పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధానికి సంబంధించిన పోక్సో–2012 చట్టంపై పాఠశాల స్థాయి నుంచి అవగాహన కలిగించాలని స్పెషల్ జడ్జి కె.నాగమణి సూచించారు. గురజాడ పబ్లిక్ పాఠశాలలో సోమవారం జరిగిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. లైంగిక వేధింపులకు అడ్డుకట్టవేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. చట్టంపై అవగాహన కల్పి స్తూ పిల్లల్లో చైతన్యం కలిగించాలన్నారు. అనంతరం నాగమణిని పాఠశాల సిబ్బంది సత్కరించారు. సదస్సులో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ హిమబిందు, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ భాగ్యం, న్యాయవాదులు జి.సత్యం, టి.రాజు, పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, కరస్పాండెంట్ ఎం.స్వరూప, హెచ్‌ఎం పూడి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నాళ్లీ డోలీ మోతలు?
శృంగవరపుకోట: ఏజెన్సీ గిరిజనానికి డోలీ మోతలు తప్పవా అంటూ గిరిశిఖర గ్రామాల వాసులు గగ్గోలు పెడుతున్నారు. రేగపుణ్యగిరిలో అరటిగెలలు పట్టుకుని కొండదిగుతుండగా ఎస్.కోటకు చెందిన సీదరి అర్జున సోమవారం ప్రమాదానికి గురయ్యాడు. కాలు విరిగిపోవడంతో వైద్యం కోసం డోలీలో మోసుకుంటూ ఎస్.కోటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రేగపుణ్యగిరి రోడ్డు నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని, లేదంటే గిరిజనులతో కలిసి ప్రజాఉద్యమం చేపడతామని గిరిజనులు, స్థానిక నాయకుడు ఒబ్బిన సన్యాసినాయుడు హెచ్చరించారు.
పకడ్బందీగా
ఏపీపీఎస్‌సీ పరీక్షలు
విజయనగరం అర్బన్: జిల్లాలో మంగళ, బుధవారాల్లో జరగనున్న ఏపీపీఎస్‌సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై తన చాంబర్‌లో సంబంఽధిత అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. 25న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, 25, 26వ తేదీల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్–2 ఉద్యోగాలకు, 26న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్ ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఉద యం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యా హ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. జిల్లాలో ఎంవీజీఆర్, అయాన్ డిజిటల్, లెండి ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎస్‌ఈ లక్ష్మణరావు, భాస్కరరావు, ఎం.బాలరాజు, కె.అనిల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
పోక్సో చట్టంపై అవగాహన అవసరం
పోక్సో చట్టంపై అవగాహన అవసరం