రూ.కోటి యంత్రం..
గదికే పరిమితం!
విజయనగరం ఫోర్ట్: ‘దేవుడు వరమిచ్చినా పూజరి కరుణించని’ చందంగా ఉంది ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యుల తీరు. రూ.కోటి ఖర్చుతో కొనుగోలుచేసిన అధునాతన డిజిటల్ ఎక్స్‌రే మిషన్‌ను గదికే పరిమితం చేసి... పాత పద్ధతిలో రోగులకు ఎక్స్‌రే సేవలందించడంపై రోగులు మండిపడుతున్నారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఊపిరితిత్తుల సమస్యలు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, వెన్నుముఖ, ఎముకలు సంబంధిత వ్యాధుల నిర్ధారణలో ఎక్స్‌రే కీలకం. దీనికోసం సర్వజన ఆస్పత్రికి ప్రతిరోజూ 100 నుంచి 120 మంది రోగులు వస్తారు. ప్రస్తుత పాత పద్ధతిలో డిజిటల్ ఎక్స్‌రే తీయడానికి ఒక వ్యక్తికి 15 నిమిషాల సమయం పడుతోంది. సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డీఆర్ ఎక్స్‌రే మిషన్‌తో అయితే ఒక వ్యక్తికి ఎక్స్‌రే తీసేందుకు 3 నిమిషాల సమయం చాలు. దీనివల్ల రోగులకు నిరీక్షణ కష్టాలు తప్పుతాయి. ఇదే విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ సంబంగి అప్పలనాయుడు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా డి.ఆర్.ఎక్స్‌రే మిషన్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని, రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ఉద్యమం తప్పదు
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వృథాగా అధునాతన డిజిటల్ ఎక్స్‌రేమిషన్
ఏర్పాటు చేసి రెండు నెలలైనా
ప్రారంభించని వైనం
జిల్లా కేంద్రంలో 43 రోజులపాటు చేపట్టిన రిలే నిరాహార దీక
జిల్లా కేంద్రంలో 43 రోజులపాటు చేపట్టిన రిలే నిరాహార దీక