
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ90 శ్రీ150 శ్రీ160
రామతీర్థంలో వైభవంగా పారాయణం
నెల్లిమర్ల రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో తిరువాయుముజీ పాశురముల పారాయణాలను భక్తులు ఆదివారం వైభవంగా నిర్వహించారు. అనకాపల్లికి చెందిన ఆచార్య గోష్ఠి బృంద సభ్యులు నాలాయర దివ్య ప్రబంధంలో తిరువాయుముజీ వెయ్యి పాశురాలను స్వామి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. అనంతరం స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్, పవన్, తదితరులు పాల్గొన్నారు.
బాక్సింగ్‌లో ప్రతిభ
బొబ్బిలి: పట్టణంలోని యాదవ వీధికి చెందిన డీసరి భాను ప్రసాద్ ఏపీ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ 200 కిలోల విభాగంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈనెల 1,2 తేదీల్లో విశాఖలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన భాను ప్రసాద్ జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యే అవకాశాలున్నాయని కోచ్‌లు కేతిరెడ్డి సాయి వరుణ్, శంబంగి పురుషోత్తంలు తెలిపారు. భానుప్రసాద్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ సాధించడంతో ఎమ్మెల్యే బేబీ నాయన రూ.20వేలను పోటీల ఖర్చుల నిమిత్తం అందజేశారు.
గొర్రెపోతుల పందాలపై పోలీసుల దాడి
● 8 మంది పందెగాళ్లను అదుపులోకి తీసుకుని 2 గొర్రెపోతులు స్వాధీనం
లక్కవరపుకోట: మండలంలోని గొల్జాం గ్రామం శివారులో గల నిర్మానుష్య ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న గొర్రెపోతుల పందాలపై ఎస్సై నవీన్‌పడాల్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా పందాలు అడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ 4,430 నగదు, రెండు గొర్రెపోతులు, రెండు సెల్‌ఫోన్‌లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. దాడుల్లో పలువురు పోలీస్‌లు పాల్గొన్నారు.
అక్రమ కట్టడాలపై హెచ్చరిక
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఎల్విన్‌పేట గ్రామంలో సర్వే నంబర్ 60(గ్రామకంఠం) సర్వే నంబర్ 58, 61లకు చెందిన స్థలంలో నేతేటి ఈశ్వరరావు అనే గిరిజనేతర వ్యక్తి చేపడుతున్న కట్టడాలు అక్రమమైనవంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు 1/70 చట్టానికి వ్యతిరేకంగా గిరిజనేతరుడు ఎల్విన్‌పేట వద్ద (గుణుపూర్ జంక్షన్) ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదంటూ గిరిజనాభ్యుదయ సంఘం నాయకుడు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు పై చర్యలకు ఉపక్రమించారు. ఆ నిర్మాణాలు అక్రమ కట్టడాలుగా గుర్తించామని, నిర్మాణాలు తక్షణమే తొలగించాలని హెచ్చరించారు. తాము జారీ చేసిన హెచ్చరికలను అతిక్రమిస్తే సీసీఎల్‌ఏ ఆదేశాల మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులో పొందుపరిచారు.

చికెన్

చికెన్

చికెన్