బొబ్బిలి: బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లో అంతర్గత రహదారుల మరమ్మతులను ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ బడగల హరిధర రావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఈ రహదారుల స్థానంలో రూ.5.50కోట్లతో కొత్త రహదారుల కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. ఆ నిధులు వచ్చేలోగా ఈ రోడ్లకు ఇప్పుడు మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. గతంలో కన్నా ఇప్పుడు హెవీ వెహికల్స్ తిరుగుతుండడంతో రహదారులు మరమ్మతులకు గురైన నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మరమ్మతు చేయిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment