
డోల మన్మథకుమార్
విజయనగరం: వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్‌సెల్ జోనల్ ఇన్‌చార్జిగా డోల మన్మథ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా 2014 నుంచి కొనసాగుతున్న ఆయన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రీవెనన్స్ సెల్ జోనల్ ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తానని చెప్పారు.
డోల మన్మథ కుమార్‌కు బాధ్యతలు