చంద్రబాబు పాలనలో రాజ్యాంగం అపహాస్యం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో రాజ్యాంగం అపహాస్యం

Apr 6 2026 8:42 AM | Updated on Apr 6 2026 8:42 AM

దళితులపై స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లు దాడులు చేస్తున్నారు కూటమి నాయకుల వేధింపులు తాళలేకే దళితుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి మీడియా సమావేశంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యలు

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో రాజ్యాంగం అపహాస్యం అవుతోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు దళితులపై దాడులు చేసి, అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వారం రోజుల క్రితం నర్సీపట్నంలో జరిగిన ఓ జాతరలో ఒక దళిత డప్పు కళాకారుడిని చెంపపై కొట్టారని, ఆయన మీద ఎందుకు కేసు నమోదు లేదని ప్రశ్నించారు. అంతకుముందు డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు దళి తులపై తప్పుడు కేసులు పెట్టి 57 మంది దళితులను అక్రమంగా జైలుకు పంపించారని పేర్కొన్నారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఇద్దరూ అధికార బలంతో దళితుల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, రాష్ట్రంలో ఉన్న దళితులమంతా ఆగ్రహిస్తే బంగాళాఖాతంలో కొట్టుకుపోతారంటూ హెచ్చరించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావుతో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రజాప్రతినిధులు చట్టాలను తుంగలో తొక్కుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు దళితులు అంటే వ్యతిరేకత, అయిష్టం ఇప్పుడే కాదు.. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేటి వరకూ దళితులపై దాడులు చేయించడం, వారిపై అక్రమ కేసులు పెట్టించడం పరిపాటిగా మారిందన్నారు. గత ఎన్నికల్లో జనసేన అధినేత, బీజేపీతో కలిసి దొంగ హామీలు ఇచ్చి దళితుల ఓట్లుతో గద్దెనెక్కారని, అధికారం చేపట్టాక దళితులపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జనసేన, టీడీపీ ప్రజాప్రతినిధుల వేధింపులు భరించలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సొంత నియోజకవర్గం పిఠాపురంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో దళిత మహిళపై జనసేన నాయకుల దాడిని గుర్తు చేశారు. అదే నియోజకవర్గంలో గతంలో మల్లం గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందినవారిని బహిష్కరణ చేశారన్నారు. ఆ గ్రామంలో వారికి టీ, టిఫిన్‌, నిత్యావసర సరకులు ఏ షాపుల్లో కూడా ఇవ్వకుండా వివక్ష చూపించారని పేర్కొన్నారు. యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో పంచదార్ల గ్రామంలో 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఇచ్చిన డి–పట్టా భూములను జనసేన ఎమ్మెల్యే విజయ్‌ కుమార్‌, ఆయన అనుచరులు రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క ఆక్రమించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో దళితులను బట్టలు విప్పి పోలీస్‌ స్టేషన్‌లో కూర్చోబెట్టారని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ..రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో దళితులు, మహిళలపై తరుచూ దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయన్నారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ వంటి ఉన్నత స్థానాల్లో ఉన్నవారు దళితులపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి అవమానకరమని, వారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. దళితుల పట్ల ఈ ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉందని, తక్షణం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణి కుమారి, మాజీ డిప్యూటీ మేయర్‌ కె.సతీష్‌ , రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ, విశాఖ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement