విశ్రాంత విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

విశ్రాంత విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

Apr 6 2026 8:30 AM | Updated on Apr 6 2026 8:30 AM

డాబాగార్డెన్స్‌: విశ్రాంత విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ విశ్రాంత విద్యుత్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎన్‌వీ రామారావు తెలిపారు. వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా తమ సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విశ్రాంత విద్యుత్‌ ఉద్యోగులు ఉన్నారని, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తమ కార్యవర్గం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. గత నెల 30న తిరుపతిలో రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగిందని, అనంతరం నిర్వహించిన సంఘ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎం.కృష్ణారెడ్డిని, జనరల్‌ సెక్రటరీగా తనను, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా డీఆర్‌ఎస్‌వీ ప్రసాద్‌, ఉపాధ్యక్షులుగా మసిలామణి, పోలినాయుడు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా కృష్ణమోహన్‌, రాయుడు తదితర బాడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ఉత్తమ జర్నలిస్ట్‌గా ఉగాది పురస్కారం అందుకున్న గంట్ల శ్రీనుబాబు, సీనియర్‌ పాత్రికేయడు నాగరాజు పట్నాయక్‌లను సత్కరించారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పీవీవీ సత్యనారాయణ, జే శ్రీరామ్మూర్తి, బి.గురునాథరావు, ఎస్‌.వరహాలు, జి.సత్యనారాయణ, ఎన్‌వీ రమణ, బి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement