రోడ్డు ప్రమాదంలో ప్లైవుడ్‌ వ్యాపారి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ప్లైవుడ్‌ వ్యాపారి మృతి

Apr 6 2026 8:30 AM | Updated on Apr 6 2026 8:30 AM

కూర్మన్నపాలెం: వడ్లపూడి సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ప్లైవుడ్‌ వ్యాపారి అశోక్‌ పటేల్‌ (32) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక అంబేడ్కర్‌ కాలనీలో నివాసముంటున్న అశోక్‌ పటేల్‌ తన ద్విచక్ర వాహనంపై వడ్లపూడి కూడలి వద్ద మలుపు తిరుగుతుండగా, వెనుక నుంచి వచ్చిన టిప్పర్‌ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన లారీ చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement