బీచ్‌రోడ్డు: మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన అల్లూరి మణికుమారి(58) సిరిపురంలో నివాసం ఉంటున్న తన కుమార్తె ఇంటికి శనివారం వచ్చింది. రాత్రి స్నానం చేసి నిద్రపోయింది. ఆదివారం ఉదయం నిద్రలేపేందుకు ప్రయత్నిస్తే చనిపోయి ఉంది. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. ఆమెకు ఆర్థిక సమస్యలున్నట్లు పోలీసులకు తెలిపారు. అయితే ఆత్మహత్య చేసుకున్నారనేందుకు ఎలాంటి ఆధారాల్లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఎస్‌ఐ చిన్నంనాయుడు కేసు దర్యాప్తు చేపట్టారు.


