సామాన్యుడిపై భారమా? | - | Sakshi
Sakshi News home page

సామాన్యుడిపై భారమా?

Mar 9 2026 7:20 AM | Updated on Mar 9 2026 7:20 AM

మద్దిలపాలెం: కేంద్రం పెంచిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.60, వాణిజ్య సిలిండర్‌ ధర రూ.114లను తక్షణమే రద్దు చేయాలని సీపీఎంజిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు డిమాండ్‌ చేశారు. గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన చేపట్టారు. పిఠాపురం కాలనీలోని సీపీఎం కార్యాలయం నుంచి మద్దిలపాలెం జంక్షన్‌ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్‌ కూటమి ఇరాన్‌పై యుద్ధానికి దిగడం వల్లే వంట గ్యాస్‌ ధరలు పెరిగాయన్నారు. రానున్న రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా పెరుగుతాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకేతాలివ్వడా న్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా ఆంక్షలు విధించడం కూడా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమన్నారు. పార్టీ జిల్లా నేతలు ఆర్‌.కె.ఎస్‌.వి. కుమార్‌, వి.కృష్ణారావు, ఎం.సుబ్బారావు, వి.నరేంద్ర కుమార్‌, వెంకటరావు, అప్పలరాజు పాల్గొన్నారు.

గ్యాస్‌ ధరల పెంపుపై సీపీఎం నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement