డాబాగార్డెన్స్: నగరంలో ‘బ్యాండ్ మేళం’ చిత్ర బృందం సందడి చేసింది. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం చిత్ర యూనిట్ మీడియా మీట్ నిర్వహించింది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ బావ–మరదళ్ల ప్రేమకథకు కోన వెంకట్ ప్రొడక్షన్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్త సమర్పణలో నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ, విశాఖ తనకు రెండో స్వగ్రామం అని, తన కుమార్తెలు కావ్య, శ్రావ్య ఈ చిత్రంతో నిర్మాతలుగా పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. సంగీతాన్ని ప్రేమించే ‘యాదగిరి’ అనే యువకుడి పాత్రలో హీరో హర్ష రోషన్, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో హీరోయిన్ శ్రీదేవి ప్రేక్షకులను అలరించనున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. వినోదానికి, ఎమోషన్లకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు సతీష్ జవ్వాది ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, కై ్లమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేశారు.


