‘ఉత్తర’ నేతలకు కీలక బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

‘ఉత్తర’ నేతలకు కీలక బాధ్యతలు

Mar 7 2026 7:16 AM | Updated on Mar 7 2026 7:16 AM

వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ

పరిశీలకులుగా నియామకం

మహారాణిపేట: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నేతలను వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులుగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉత్తర నియోజకవర్గానికి చెందిన బాణాల శ్రీనివాస్‌ను అరకు నియోజకవర్గ పరిశీలకుడిగా, పేడాడ రమణికుమారిని విజయనగరం జిల్లా చీపురుపల్లికి, రొంగలి జగన్నాథంను బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకుడిగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement