ఏయూ క్యాంపస్: సమాజంలోని వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి దేశాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖులను గుర్తిస్తూ ఆసియా టుడే రీసెర్చ్–మీడియా ఆధ్వర్యంలో ‘ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్–2026’ కార్యక్రమం బీచ్‌రోడ్డులోని నోవాటెల్ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరై విజేతలకు అవార్డులు అందజేశారు. ఈ వేడుకలో కేంద్ర మంత్రి ఎస్.పి.సింగ్ భగేల్, ఎంపీ గొల్ల బాబూరావు తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్‌మాట్లాడుతూ దక్షిణ భారతదేశం ప్రతిభకు పుట్టినిల్లని, వివిధ రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో రాణిస్తున్న ప్రతిభావంతులను గౌరవించడం దేశానికే గర్వకారణమన్నారు.


