ప్రేక్షకుల ఆదరణే మా విజయం | - | Sakshi
Sakshi News home page

ప్రేక్షకుల ఆదరణే మా విజయం

Mar 7 2026 7:15 AM | Updated on Mar 7 2026 7:15 AM

‘రాయుడు గారి తాలూకా’ హీరో శ్రీనివాస్‌

డాబాగార్డెన్స్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో కథాబలం ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ‘రాయుడు గారి తాలూకా’తో మరోసారి నిరూపితమైందని హీరో శ్రీనివాస్‌ ఉలిశెట్టి అన్నారు. ఆయన హీరోగా సత్య ఈషా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. నగరంలోని వేంకటేశ్వర థియేటర్‌లో సినిమా నటీనటులు, ప్రేక్షకులతో కలిసి ఆయన సినిమాను వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘మా కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది. సినిమా చూసి బయటకు వస్తున్న ప్రేక్షకుల కళ్లలో కనిపిస్తున్న ఆనందమే మా విజయం’అని పేర్కొన్నారు. నగేష్‌ గౌరేష్‌ అందించిన నేపథ్య సంగీతం సస్పెన్స్‌ సన్నివేశాలను ఎలివేట్‌ చేసిందని, గౌతమ్‌ విజువల్స్‌ సినిమాకు రిచ్‌ లుక్‌ ఇచ్చాయని తెలిపారు. ఈ చిత్రంలో పలాస రామారావు, అమ్మరాజు, రమణారెడ్డి, రవిశెట్టి, పైడిరాజు, నాగరాజు, శ్రీహరి, సుమన్‌, కిట్టయ్య, ఆర్కే నాయుడు, ఫణిస్వామి, సృజన తదితరులు వివిధ పాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement