ఎఫ్‌ఎస్‌ఐ విశాఖ విభాగంలో ఉన్న రెండు ప్రధాన నౌకల్లో ‘మత్స్యదర్శిని’ ఒకటి. 1978లో హాలండ్‌లో నిర్మించిన ఈ కాంబినేషన్ ట్రాలర్ నౌక దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. 2024 ఆగస్టులో సాంకేతిక లోపాలతో నిలిచిపోయిన ఈ నౌకకు డాక్‌యార్డులో దీర్ఘకాలిక మరమ్మతులు నిర్వహించారు. దాదాపు రూ.5 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేసి, 2025 అక్టోబర్ 31న ట్రయల్ ఫిషింగ్ సర్వేకు పంపించారు. ప్రస్తుతం ఇది సేవలందిస్తున్నప్పటికీ, అర్ధశతాబ్దం నాటి ఇంజిన్లు, పాత సాంకేతిక వ్యవస్థలతో దీర్ఘకాలికంగా సమర్థవంతంగా పనిచేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోతైన సముద్ర అన్వేషణకు ఈ నౌక సామర్థ్యం పరిమితమేనని నిపుణులు పేర్కొంటున్నారు.
మత్స్యదర్శిని నౌక


