గ్రహణ వేళ మంత్రజపం | - | Sakshi
Sakshi News home page

గ్రహణ వేళ మంత్రజపం

Mar 4 2026 7:14 AM | Updated on Mar 4 2026 7:14 AM

ఏయూ క్యాంపస్‌: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం నగరవాసులు భారీ సంఖ్యలో సముద్ర తీరానికి తరలివచ్చారు. గ్రహణానికి ముందు చేసే పట్టు స్నానం, గ్రహణానంతరం ఆచరించే విడుపు స్నానం కోసం భక్తులు సాగర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. గ్రహణ సమయంలో చేసే మంత్ర జపం అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుందనే నమ్మకంతో, అనేకమంది భక్తులు సముద్ర తీరంలోనే కూర్చుని తమ ఇష్ట దైవాల నామస్మరణ, జపాలు చేస్తూ కనిపించారు. గ్రహణ దోష నివారణ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రహణ ప్రభావం ఉన్న నక్షత్రాల వారు బుధవారం ఉదయం ఆలయాల్లో ప్రత్యేక శాంతి పూజలు, అభిషేకాలు నిర్వహించుకోనున్నారు.

విశాఖ తీరంలో పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement