సాగరకన్య నౌకలో పాముల కలకలం
సింథియా: మరమ్మతుల నిమిత్తం విశాఖ హిందూస్థాన్ షిప్‌యార్డ్‌కు వచ్చిన ‘సాగరకన్య’ పరిశోధనా నౌకలో వరుసగా పాములు బయటపడుతుండటంతో కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారు. కొద్దిరోజుల కిందట నాగుపాము కనిపించగా, తాజాగా ఆదివారం భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. స్నేక్ క్యాచర్ నాగరాజు చాకచక్యంగా ఆ కొండచిలువను పట్టుకున్నారు. అండమాన్ సమీపంలో మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన సమయంలోనే పాములు నౌకలోకి చేరి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంజిన్ గదిలో మరిన్ని పాములు ఉండే అవకాశం ఉందన్న హెచ్చరికలతో కార్మికులు నౌకలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. సముద్రశాస్త్ర అధ్యయనాల్లో అత్యంత కీలకమైన ఈ నౌక పనులు పాముల బెడద కారణంగా నెమ్మదిస్తుండటంతో షిప్‌యార్డ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు.


