‘ద్రోణంరాజు’ ఓ రాజకీయ యూనివర్సిటీ
బీచ్‌రోడ్డు: ఉత్తరాంధ్ర టైగర్‌గా పేరుగాంచిన ద్రోణంరాజు సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వవిద్యాలయం వంటివారని, నేడు పదవుల్లో ఉన్న ఎంతోమంది ఆయన శిష్యులేనని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పేర్కొన్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ ఆధ్వర్యంలో సిరిపురంలోని జంక్షన్‌లోని ద్రోణంరాజు సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు. ద్రోణంరాజు కుమారుడు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా నిబద్ధత గల నాయకుడిగా ఎదిగారన్నారు. తండ్రి శ్రీనివాస్ అడుగుజాడల్లో శ్రీవత్సవ నడవడం అభినందనీయమన్నారు. అనంతరం ద్రోణంరాజు శ్రీవత్సవ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తన తాతగారు చేసిన కృషి, తన తండ్రి సంపాదించిన నిష్కళంకమైన పేరు తనకు స్ఫూర్తిదాయకమన్నారు. మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ మేయర్ హరి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు , తిప్పల దేవన్ రెడ్డి , పార్టీ నేతలు కోలా గురువులు, డాక్టర్ జహీర్ అహ్మద్, కొండా రాజీవ్ గాంధీ, కార్పొరేటర్లు బాణాల శ్రీనివాస్, చెన్నా జానకీరామ్, బిపిన్ కుమార్ జైన్, ముమ్మన దేముడుు, ఉరుకూటి చందు, కందుల నాగరాజు, మువ్వల లక్ష్మి,, ఆర్.వెంకటరావు, పల్లా దుర్గారావు, వుడా మాజీ చైర్మన్ రవి పాల్గొన్నారు.


