న్యాయ విశ్వవిద్యాలయాల
బలోపేతమే లక్ష్యం
సబ్బవరం: భారతదేశంలోని న్యాయ విశ్వవిద్యాలయాలు, అమెరికన్ న్యాయ విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని హైదరాబాద్‌లోని యూఎస్ కౌన్సిల్ సిటిజన్ సర్వీసెస్ చీఫ్ ఆడమ్ హల్ స్పష్టం చేశారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సూర్యప్రకాశరావుతో సమావేశమైన ఆయన వర్సిటీలో అమలవుతున్న పాఠ్యాంశాల అభివృద్ధి, జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. ఇరు దేశాల మధ్య విద్యా సంబంధిత మార్పిడి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆడమ్ హల్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ బోధన సిబ్బంది, సహాయక సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులుపాల్గొన్నారు.పాల్గొన్నారు.


