వైజ్ఞానిక ప్రదర్శనలతో మేధోసంపత్తి
తాటిచెట్లపాలెం: విద్యార్థులలో విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని, అవగాహనను పెంచడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు కీలకమని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎన్. ప్రేమకుమార్ అభిప్రాయపడ్డారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో రైల్వే న్యూకాలనీలోని జీవీఎంసీ హైస్కూల్ మరియు కేఎన్‌ఎం గర్‌ల్స్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రదర్శనలో జిల్లాలోని 11 మండలాల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం ఏడు సబ్ థీమ్‌ల కింద 7 ప్రాజెక్టులు, విద్యార్థుల వ్యక్తిగత విభాగం నుంచి రెండు, ఉపాధ్యాయుల వ్యక్తిగత విభాగం నుంచి రెండు చొప్పున.. ఒక్కో మండలం నుంచి 11 ప్రాజెక్టుల వంతున మొత్తం 121 ప్రాజెక్టులను ప్రదర్శించారు.
ఈ పోటీలలో విద్యార్థుల విభాగం నుంచి ఎస్. చైతన్య, వి. సాత్విక్, ప్రసన్న, లావణ్య, బి. కుషాలిని, పి. లావణ్య, జి. విష్ణు, బి. రామచంద్రన్, ఎస్. సాయి, ఎస్. కృష్ణతేజ, బి. శ్రీనివాస్, కే. హర్షవర్ధన్, బి. తనూజ, పి.బి. శృతి, కే. యోగి, పి. మహేష్, బి. సంధాన, బి. లాస్య ప్రతిభ కనబరిచారు. అలాగే ఉపాధ్యాయ విభాగంలో బి. సీతారాం, డి. ప్రసన్నలక్ష్మి రూపొందించిన ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. కార్యక్రమంలో జీవీఎంసీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని ఎస్.వి. శేషుకుమారి, కేఎన్‌ఎం గర్‌ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని డి. శాంతకుమారి, జిల్లా సైన్స్ అధికారి పి. రాజారావు, జిల్లా ఉప విద్యాశాఖాధికారి సోమేశ్వర్రావు, స్థానిక కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కేఎన్‌ఎం బాలిక ఉన్నత పాఠశాలలో విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు
వైజ్ఞానిక ప్రదర్శనలతో మేధోసంపత్తి
వైజ్ఞానిక ప్రదర్శనలతో మేధోసంపత్తి
వైజ్ఞానిక ప్రదర్శనలతో మేధోసంపత్తి


