ఐఈఎస్‌లో అచ్యుత సాయికి 8వ ర్యాంక్
గోపాలపట్నం: యూపీఎస్సీ విడుదల చేసిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) ఫలితాల్లో విశాఖ ఎన్‌ఏడీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న దండు అచ్యుత సాయి రామ్ రెడ్డి ఆలిండియా 8వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. 2024లో 14వ ర్యాంక్ సాధించినప్పటికీ, రైల్వే విభాగంపై ఉన్న మక్కువతో ఆయన మళ్లీ పరీక్ష రాసి ఈ ఘనత సాధించారు. తన కోరిక నెరవేరడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ విజయాన్ని దివంగత తల్లికి అంకితమిస్తున్నట్లు సాయి రామ్ రెడ్డి తెలిపారు. ఆయన ప్రతిభను కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగులు అభినందించారు.


