యురేకా...
విజేతలు వీరే...
● 42 కిలోమీటర్ల మారథాన్ పురుషుల విభాగంలో కెబేడ గుమెస్సా 2.29గంటల 39 సెకన్లలో పరుగు పూర్తి చేసి విజేతగా నిలిచారు. ఆ తర్వాత పి. రామ్‌వెట్టి 2.29గంటల 47 సెకన్లలో, స్టీఫెన్ 2.37గంటల 20 సెకన్లలో పూర్తి చేసి రన్నరప్‌లుగా నిలిచారు.
● 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ (సబ్‌మైరెన్ హాఫ్ మారథాన్) మహిళల ఓపెన్ విభాగంలో సంగమిత్ర మెహతా 1.27 గంటల 41 సెకన్లలో పరుగు పూర్తి చేసి విజేతగా నిలిచారు. ఎం. ఉమ, జ్యోతిదుర్గ రన్నరప్ స్థానాలను దక్కించుకున్నారు. 35–50 ఏళ్ల వారి విభాగంలో హర్మీత్, 50+ విభాగంలో అమర్‌జీత్ విజేతలుగా నిలిచారు.
● 10 కిలోమీటర్ల పరుగు (ఎయిర్‌క్రాఫ్ట్ రన్) మహిళల విభాగంలో విశాఖకు చెందిన అథ్లెట్ ఎల్. మెర్సీగ్రేస్ 43.10 సెకన్లలో పరుగును పూర్తి చేసి విజేతగా నిలిచారు. ఆమె రూ.25,000 ప్రోత్సాహకాన్ని అందుకున్నారు. టి. వాణి, సౌమ్య రన్నరప్ స్థానాలను దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో ప్రశాంత్ 32 నిమిషాల 54 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలవగా, ఎం. హరీష్, సూర్యజిత్ రన్నరప్‌లుగా నిలిచారు.
ఉరిమే ఉత్సాహం..


