పెద్ద మనసు చాటుకున్న వాసుపల్లి
డాబాగార్డెన్స్: బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన నెల్లిమర్లకు చెందిన 9 మంది మత్స్యకారుల కుటుంబాలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం ఇచ్చి భరోసా కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆశీల్‌మెట్ట కార్యాలయంలో మత్స్యకార బాధిత కుటుంబాలను ఆదుకున్నారు. మొత్తం 9 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు చొప్పున సాయం అందించడంతో పాటు 25 కేజీల రైస్ బ్యాగ్ ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ స్పందనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్ర దేశంలో బందీగా ఉన్న వారిని విడిపించడానికి చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో శత్రుదేశమైన పాకిస్తాన్ చెర నుంచి 20 మంది మత్స్యకారులను విడిపించి ఫ్లైట్‌లో తీసుకొచ్చి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు తక్షణ సాయం అందించిన మత్స్యకార పక్షపాతి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వాసుపల్లి గుర్తు చేశారు. బాధితులు చెర నుంచి విడుదలయ్యే వరకు వారికి రేషన్ కూడా అందిస్తామని వాసుపల్లి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు లండా రమణ, గంగళ్ల రామరాజు, బొడ్డు ఆనంద్, బర్రి కొండలరావు, ఆకుల యేసు, గుంటు ఆనంద్, చోడిపిల్లి శివ, వాసుపల్లి ధనరాజు, దూడ అప్పారావు, దూడ తాతారావు, చేపల నూకరాజు, వేణు, సాగర్, ప్రసాద్, సతీష్, సూరని రాము, దూడ అప్పలరాజు, ముజీబ్‌ఖాన్, గురజాపు రవి, ఈతలపాక విజయ్, అరుణ, వాసు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోయినా వాసుపల్లి గణేష్‌కుమార్‌పెద్ద మనసు చాటుకోవడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు.


