అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం
అల్లిపురం: మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధి బీచ్‌రోడ్‌లోని ఫార్చ్యూన్ బీచ్ ఫ్రంట్ అపార్ట్‌మెంట్‌లో బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య తెలిపిన వివరాలు.. ఫ్లాట్‌లో ఉంటున్న ఓ వృద్ధురాలు దేవుడి వద్ద దీపం వెలిగించింది. తరువాత కిటికీ తలుపులు తీయటంతో ఆ గాలికి దీపం ఎగిరి కింద పడింది. కిందనున్న మ్యాట్‌కు మంటలు అంటుకున్నాయి. అవి రెండు గదులకు వ్యాపించాయి. ప్రమాదంలో రూ.లక్షల విలువైన ఫర్నిచర్ అగ్నికి ఆహుతైనట్లు డీఎఫ్‌వో తెలిపారు. విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ఆయన అపార్ట్‌మెంట్‌లోని ఫైర్ సేఫ్టీ పరికరాలను పరిశీలించారు.
అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం


