సరస్ ఎగ్జిబిషన్‌కు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట : కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్ ఎగ్జిబిషన్–2025కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే డ్వాక్రా, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉండేందుకు వీలుగా పెందుర్తిలోని టీటీడీసీలో వసతి కల్పించాలన్నారు. నోడల్ అధికారి డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీపతితో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణకు పూర్తిస్థాయి సహకారం అందించాలని, స్వయం సహాయక సంఘాలకు తోడ్పాటు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. అనంతరం సరస్ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.


