జాతీయ స్కేటింగ్‌కు విశాఖ సై | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్కేటింగ్‌కు విశాఖ సై

Dec 6 2025 7:24 AM | Updated on Dec 6 2025 7:24 AM

జాతీయ స్కేటింగ్‌కు విశాఖ సై

జాతీయ స్కేటింగ్‌కు విశాఖ సై

నేటి నుంచి జాతీయ రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌ బరిలో 34 జట్లు పతకాల

విశాఖ స్పోర్ట్స్‌: ఆరేళ్ల విరామం అనంతరం జాతీయ రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌కు విశాఖపట్నం మరోసారి వేదికై ంది. భారత రోలర్‌ స్కేటింగ్‌ సమాఖ్య, కేంద్ర క్రీడా, యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ పోటీలు జరగనున్నాయి. 10 రోజుల పాటు జరగబోయే ఈ క్రీడా సంబరంలో చిన్నారుల నుంచి సీనియర్ల వరకు.. బాలబాలికలు, పురుషులు, మహిళలు వివిధ విభాగాల్లో పోటీపడనున్నారు.

భారీగా తరలివచ్చిన క్రీడాకారులు

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 34 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. స్పీడ్‌, ఆర్టిస్టిక్‌, రోలర్‌ హాకీ, ఇన్‌లైన్‌ స్కేటింగ్‌, డెర్బి, స్కేట్‌బోర్డ్‌ తదితర 11 అంశాల్లో పోటీలు నువ్వా నేనా అన్నట్లు సాగనున్నాయి. వయసు ఆధారంగా టైనీటాట్స్‌, క్యాడెట్స్‌, సబ్‌–జూనియర్‌, జూనియర్‌, సీనియర్స్‌, మాస్టర్స్‌.. ఇలా ఆరు కేటగిరీలుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు.

ముస్తాబైన వేదికలు : అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆంధ్రా స్కేటర్‌ ఆనందకుమార్‌తో పాటు, పలువురు జాతీయ స్థాయి స్కేటర్లు ఇప్పటికే విశాఖ చేరుకుని సాధన చేస్తున్నారు. పోటీల నిర్వహణ కోసం నగరంలోని పలు రింక్‌లను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. వీఎంఆర్డీఏ పార్క్‌, శివాజీ పార్క్‌ రింక్స్‌తో పాటు బోయపాలెం రింక్‌లో స్పీడ్‌ రేస్‌ పోటీలు, కై లాసగిరిలో డౌన్‌హిల్‌ పోటీలు నిర్వహించనున్నారు.

సాంకేతిక కారణాలతో నేటి నుంచి..

వాస్తవానికి ఈ పోటీలు శుక్రవారం నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల శనివారం నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర రోలర్‌ స్కేటింగ్‌ సంఘం అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం వీఎంఆర్డీఏ పార్క్‌ స్పీడ్‌ రింక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శుక్రవారం జరగాల్సిన ఈవెంట్లను శనివారం నిర్వహిస్తామని, తొలి మూడు రోజులు చిన్నారులకు పోటీలు ఉంటాయని వెల్లడించారు. తక్కువ సమయంలోనే పోటీలకు అనువుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసిందని రోలర్‌ స్కేటింగ్‌ సంఘం కార్యదర్శి థామస్‌ ప్రశంసించారు. స్కేటింగ్‌ క్రీడలో యువతను ప్రోత్సహించడమే తమ ప్రధానోద్దేశమని పేర్కొన్నారు. పోటీల సమయంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశామని శీలం లక్ష్మణ్‌ తెలిపారు.

డిఫెండింగ్‌ చాంపియన్లుగా బరిలోకి..

గతేడాది ఆర్టిస్టిక్‌ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన ఆంధ్రా స్కేటర్లు ఈ సారి డిఫెండింగ్‌ చాంపియన్లుగా రింక్‌లోకి దిగుతున్నారు. స్పీడ్‌ రేస్‌లో గత విజేత తమిళనాడు బరిలో ఉంది. రోలర్‌ హాకీలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు పంజాబ్‌, హర్యానా సిద్ధమయ్యాయి.

వేటలో ఆంధ్ర స్కేటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement