వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు
ఎంవీపీకాలనీ : వైఎస్సార్‌సీపీ రాష్ట్ర స్థాయి కమిటీల్లో పలువురు జిల్లా నాయకులకు చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. స్టేట్ లీగల్ సెల్ ఉపాధ్యక్షురాలిగా కె.వెంకటనాగ శశికళ (విశాఖ నార్త్), స్టేట్ అంగన్‌వాడీ వింగ్ ఉపాధ్యక్షురాలిగా పిల్లా సుజాత (భీమిలి), స్టేట్ అంగన్‌వాడీ వింగ్ కార్యదర్శిగా నక్కా శ్యామల (విశాఖనార్త్), స్టేట్ మహిళ విభాగం ప్రధాన కార్యదర్శిగా నల్లా కృపాజ్యోతి (విశాఖ ఈస్ట్), కార్యదర్శులుగా పతివాడ వెంకటలక్ష్మి (విశాఖ ఈస్ట్), యల్లబిల్లి వరలక్ష్మి (విశాఖ నార్త్), స్టేట్ బీసీ సెల్ కార్యదర్శిగా కురుకూటి అప్పలనారాయణ (భీమిలి), స్టేట్ ఎస్సీ సెల్ కార్యదర్శిగా కొరువాడ చిన్నారావు (విశాఖ నార్త్), స్టేట్ సోషల్ మీడియా వింగ్ ప్రధాన కార్యదర్శిగా జి.పెంటారెడ్డి (గాజువాక), స్టేట్ సోషల్ మీడియా వింగ్ అదనపు కార్యదర్శిగా జె.లీలానాగవలి (విశాఖ వెస్ట్), స్టేట్ పబ్లిసిటీ వింగ్ కార్యదర్శులుగా సరగడం పత్నిరావు (విశాఖ వెస్ట్), బొర కుమార్‌రెడ్డి (విశాఖ ఈస్ట్) స్టేట్ పబ్లిసిటీ వింగ్ అదనపు కార్యదర్శులుగా అడపా శివ (విశాఖ సౌత్), బొడ్డేటి అనంత వెంకటవేణు (విశాఖ వెస్ట్), వేదల్ల శ్రీనివాసరావు (విశాఖ వెస్ట్‌లు) నియమితులయ్యారు.
జిల్లా కమిటీల్లో...
పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గనగళ్ల రామరాజు (విశాఖ సౌత్), జిల్లా యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా జి.అప్పలరాజు (గాజువాక), జిల్లా కార్యదర్శులుగా జి.రామిరెడ్డి (గాజువాక), బి.శివరామ్ ప్రసాద్ (విశాఖ నార్త్), జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొల్లి దేముడు (గాజువాక), జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా బోరా శశిభూషణ్ (గాజువాక), జిల్లా బీసీ సెల్ కార్యదర్శిగా నంభూరు రాజు (గాజువాక), జిల్లా ఆర్టీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా తెంటు గోపాలరావు (గాజువాక), జిల్లా బూత్ కమిటీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా ధర్మాల వెంకటరెడ్డి (గాజువాక), కార్యదర్శిగా గుర్రం రాజేష్ (గాజువాక), జిల్లా ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా రెయ్యి జగదీష్‌రెడ్డి (గాజువాక), కార్యదర్శిగా పండ్రంగి రాజేష్ (గాజువాక), జిల్లా వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎస్.సాయిరామ్ (గాజువాక), కార్యదర్శిగా ఇప్పిలి వెంకటేష్ (గాజువాక), జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మహ్మాద్ షఫీ (గాజువాక) నియమితులయ్యారు.
నియోజకవర్గాల అనుబంధ విభాగాల నాయకులుగా పలువురు నియమితులయ్యారు. విశాఖ వెస్ట్ నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఎం.జాన్ శ్రీకాంత్‌కుమార్, నియోజవకర్గాల వైఎస్సార్‌టీఎఫ్ అధ్యక్షులుగా పొన్నాడ అప్పారావు (విశాఖనార్త్), సారిక దివ్యకుమార్ (విశాఖ సౌత్), వి.స్వర్ణలత (విశాఖ వెస్ట్), పి.ఎం.సత్యనారాయణరెడ్డి (గాజువాక) నియమితులయ్యారు. పార్టీ నార్త్ నియోజకవర్గ వార్డు అధ్యక్షులుగా మువ్వల పోలారావు (25వ వార్డు), కర్రి రామారెడ్డి (26వ వార్డు), డొప్పా శ్రీను (48వ వార్డు), మెట్టా ధమయంతి (51వ వార్డు) నియమితులయ్యారు.


