సింహగిరిపై షెడ్ ప్రారంభోత్సవం
సింహాచలం: సింహగిరిపై ఆలయ ఉత్తర రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన పర్మినెంట్ షెడ్(టెన్సిల్ మెంబరేన్ షెల్టర్)ను మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం సుమారు రూ.3 కోట్లతో చైతన్య విద్యా సంస్థలు దీన్ని నిర్మించారు. ఈ సందర్భంగా శాంతి హోమం, వాస్తు హోమం, సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు. అనంతరం వివిధ సంస్థల సీఎస్సార్ నిధులు, దాతల వివరాలు రూ.2.03 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బొప్పన ఝాన్సీలక్ష్మీబాయి, ప్రభుత్వ విప్ పెతకంశెట్టి గణబాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, 98వ వార్డు కార్పొరేటర్ పి.వి.నరసింహం, చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్స్ శ్రీధర్, బొప్పన సుష్మ, టి.నాగేంద్రకుమార్, చైతన్య ఎగ్జిక్యూటివ్ ఏజీఎంలు కె.వి.రమణ, ఎం.వి.సురేష్, దేవస్థానం డిప్యూటీ ఈవో రాధ, ఏఈవో తిరుమలేశ్వరరావు, ఈఈలు రామకృష్ణ, రమణ పాల్గొన్నారు.


